శ్రీవారికి రికార్డు స్థాయిలో విరాళాలు
NEWS Oct 21,2025 12:25 pm
శ్రీవారికి రికార్డు స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు గత 11 నెలల కాలంలో రికార్డు స్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి. 2024 నవంబర్ 1 నుంచి 2025 అక్టోబర్ 16 వరకు ఏకంగా ₹ 918.6 కోట్లు విరాళాలుగా అందినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. ఈ విరాళాల్లో శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకే ₹ 338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు ₹ 252.83 కోట్లు, శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు ₹ 97.97 కోట్లు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ₹ 66.53 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు ₹ 56.77 కోట్ల చొప్పున భక్తులు కానుకలు సమర్పించారు.