టెక్సాస్ గవర్నర్ నివాసంలో దీవాళి వేడుక
NEWS Oct 21,2025 11:28 am
టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. గత 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో గవర్నర్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రవాస భారతీయులకు ఆతిథ్యం ఇచ్చారు. టెక్సాస్ అభివృద్ధిలో భారతీయుల పాత్రను ఆయన ప్రశంసించారు. భారత కాన్సల్ జనరల్ మంజునాథ్ దంపతులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. వేడుకలను అనురాగ్ జైన్ దంపతులు సమన్వయం చేశారు. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.