సోమవారం రాత్రి బొర్రాగుహ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా, బొర్రాగులకు వెళ్లే ప్రధాన రహదారి రైల్వే గేటు మలుపు వద్ద కొండచరియలు విరిగిపడి రహదారిపై మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. దీంతో వాహన రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడినట్లు ప్రయాణికులు తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై పడిన కొండచరియలు, మట్టి దిబ్బలను తొలగించి రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.