ఇంటి నుండి వెళ్లిపోయిన యువతి
NEWS Oct 21,2025 11:49 am
భద్రాచలం పట్టణంలోని భగవాన్ దాస్ కాలనీలో నివసించే జి. గీతాంజలి (18) సోమవారం సాయంత్రం ఇంట్లో అమ్మమ్మ మందలించడంతో కోపంగా ఇంటి నుండి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదని, తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గీతాంజలి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాలు తెలియజేయవలసిన ఫోన్ నంబర్: 9908131860. ఈ ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు.