అంబరాన్నంటిన దీపావళి సంబరాలు
NEWS Oct 20,2025 09:32 pm
హైదరాబాద్ నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. వాడ వాడల్లో బాంబుల మోతలు మోగుతున్నాయి. సాయంత్ర వేళ దేవుళ్లకు దీపారాధనలు చేసిన అనంతరం నగర వాసులు అసలు కార్యక్రమాన్ని షూరు చేశారు. చిచ్చు బుడ్డులు, తారాజువ్వలు, పటాసులు, థౌజండ్ వాలాస్ వంటి అనేక రకాల బాంబులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇలా ఎంతో సరదాగా దీపావళి వేడుక జరుపుకుంటూ తమ జీవితాల్లో వెలుగు నింపాలని ప్రజలు కోరుకున్నారు. పలు చోట్ల అయితే పెద్ద సంఖ్యలో క్రాకర్స్ పేలుస్తూ యువతి, యువకులు తెగ ఎంజాయ్ చేశారు.