బలొచిస్థాన్‌పై సల్మాన్ కామెంట్స్ వైరల్
NEWS Oct 20,2025 09:21 pm
సౌదీలో జరిగిన 'జాయ్ ఫోరమ్-2025'లో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. షారూఖ్, ఆమిర్‌లతో కలిసి పాల్గొన్న ఆయన, సౌదీలో భారతీయ చిత్రాల మార్కెట్‌పై మాట్లాడారు. సౌదీలో "బలొచిస్థాన్, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్"కు చెందిన వారు పనిచేస్తున్నారని, అక్కడ హిందీ, సౌత్ సినిమాలు బాగా ఆడతాయని అన్నారు. ఐతే, పాకిస్థాన్‌లో భాగమైన బలొచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొనడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇది సల్మాన్‌కు తెలియక అన్నారా, లేక పొరపాటా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు పాక్ అభిమానులకు గట్టి షాక్ ఇచ్చాయని కొందరు సెటైర్లు వేస్తున్నారు.