ప్రముఖ నటుడు కన్నుమూత!
NEWS Oct 20,2025 09:13 pm
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. అస్రాని తన 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా సినిమామాల్లో నటించారు. కమెడియన్, సపోర్టింగ్ నటుడిగా హిందీ సినిమాల్లో రాణించారు. మేరే అప్నే, కోషిష్, బావర్చీ, పరిచయ్, అభిమాన్, చుప్కే చుప్కే లాంటి సినిమాల్లో నటించారు. బ్లాక్‌బస్టర్ మూవీ 'షోలే'లో కూడా పోలీసు ఆఫీసర్‌గా కనిపించారు.