విశ్వాసం ఉన్నవారికే దీపావళి శుభాకాంక్షలు
NEWS Oct 20,2025 09:09 pm
తమిళనాడు డిఫ్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన తీరుపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఓ సభలో 'విశ్వాసం ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు' అని ఉదయనిధి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై తీవ్రంగా స్పందించారు. ఇతర మతాల ప్రజలకు శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఉదయనిధి.. విశ్వాసం ఉన్నవారికి అని అనరని.. కానీ, హిందూ మతానికి వచ్చేసరికి మాత్రం నమ్మకం ఉన్నవారికి అని అంటారని తమిళిసై మండిపడ్డారు. పండుగల సమయంలో హిందువులకు శుభాకాంక్షలు చెప్పాలనే కనీస మర్యాద కూడా డీఎంకే ప్రభుత్వానికి లేదని తమిళ బీజేపీ లీడర్లు మండిపడుతున్నారు.