ఇదెక్కడి పిచ్చి రా బాబు అనేలా ఓ వైరల్ వీడియోలోని వ్యక్తి 1000 వాలా టపాసుల దండను నడుము నుంచి కాళ్ళ చుట్టూ చుట్టుకోగా.. అతడి 2 చేతులను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత మరో వ్యక్తి ఆ టపాసులకు నిప్పంటించాడు. ఆ టపాసులు పేలడంతో మంటలు, పొగ, చెవులు చిల్లులు పడే శబ్దాల మధ్య ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ దృశ్యం చూస్తున్న వారికి గుండె జారిపోయేలా ఉంది. "అయ్యా బాబూ! పటాసులు నేలపై పేలడానికి తయారు చేశారు. ఒంటిపై పేల్చుకోవడానికి కాదు" అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కేవలం కొన్ని వ్యూస్, లైకులు కోసం ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? అంటూ మండిపడుతున్నారు.