మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయోద్దు
NEWS Oct 20,2025 09:44 pm
APలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా నిలుపుకోవాలని గిరిజన యువత డిమాండ్ చేశారు. పాడేరు ఎమ్మెల్యే మత్యారాస విశ్వేశ్వర రాజు సూచనల మేరకు గూడెం కొత్త వీధి మండలం, ఆర్.వి.నగర్ పరిధిలో ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ వైద్య విద్య ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులు నష్టపోతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత, వైఎస్సార్సీపీ అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.