2 లారీల క్రాకర్స్‌తో బండ్ల గణేష్ దివాళి
NEWS Oct 20,2025 10:42 am
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దీపావళి వేడుకలు అంబరాన్నంటాయ్. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా 'బండ్ల దివాళీ 2025' పేరుతో తన ఇంట దీపావళి పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ తారలు, ప్రముఖులు హాజరై సందడి చేశారు. హీరోలు చిరంజీవి, వెంకటేష్, తేజ సజ్జ, బెల్లంకొండ శ్రీనివాస్, సిద్దు జొన్నలగడ్డ, నిర్మాతలు నవీన్ యర్నేని, అశ్వినీ దత్ దర్శకులు అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, చందూ మొండేటీ, హరీష్ శంకర్ తదితరులు బండ్ల ఇంటి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ భారీగా క్రాకర్స్ తెచ్చారు. రకరకాల పటాసులతో ఇంటిని నింపేశారు.