కానిస్టేబుల్‌ను రియాజ్ ఎందుకు చంపాడు?
NEWS Oct 20,2025 03:33 pm
TG: ఓ కేసు విషయంలో కానిస్టేబుల్ ప్రమోద్ శుక్రవారం రియాజ్‌ను పట్టుకుని బైకుపై పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. రియాజ్ తన దగ్గర ఉన్న కత్తితో ప్రమోద్ ఛాతిలో పొడిచి పారిపోయాడు. ఆ క్రమంలో ఓ ఎస్సైపైనా దాడికి పాల్పడ్డాడు. ప్రమోద్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. రియాజ్‌పై చైన్ స్నాచింగ్, దొంగతనాలు, గొడవల వంటి 60కి పైగా కేసులున్నాయి. నాలుగైదుసార్లు జైలుకెళ్లొచ్చాడు.