సీరియస్ వార్నింగ్ ఇచ్చిన డీజీపీ
NEWS Oct 20,2025 03:26 pm
తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఎలాంటి నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. రియాజ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి కోటి పరిహారంతో పాటు వాళ్ల ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంటి స్థలం, ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రియాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రూం బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కుని ఆ గన్‌తో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడని డీజీపీ తెలిపారు. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవని.. పోలీసుల ఆత్మరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగా రియాజ్ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని తెలిపారు