నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం. ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రియాజ్ గన్‌ను లాక్కునే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రియాజ్ చనిపోయాడు. రియాజ్ జరిపిన కాల్పుల్లో ఏఆర్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.