నేవి సిబ్బందితో మోదీ దీపావళి వేడుకలు
NEWS Oct 20,2025 12:32 pm
ప్రధాని మోదీ ఈ దీపావళిని ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై నేవీ సైనికులతో కలిసి జరుపుకున్నారు. గోవా కార్వార్ తీరంలో ఉన్న స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించిన ప్రధాని.. నేవి సిబ్బందితో కలిసి దీపాల పండుగను ఉల్లాసంగా జరుపుకున్నారు. సైనికులను తన కుటుంబంగా భావిస్తున్నానని, అందుకే పండుగ జరుపుకోవడానికి వచ్చానని మోదీ భావోద్వేగంగా చెప్పారు. వారి దేశభక్తి, ఉత్సాహం చూసి సంతృప్తిగా త్వరగా నిద్రపోయానని తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ మన దేశ శక్తికి, ఆత్మవిశ్వాసానికి గొప్ప నిదర్శనమని ప్రధాని కొనియాడారు.