భారత్‌కు ట్రంప్ మళ్లీ హెచ్చరిక
NEWS Oct 20,2025 12:09 pm
రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపకపోతే భారత ఎగుమతులపై "భారీ సుంకాలు" విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ హెచ్చరించారు. తాను భారత ప్రధాని మోదీతో మాట్లాడానని, చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని ఆయన తనకు హామీ ఇచ్చారని గతంలో చేసిన వాదననే ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. గతంలో ట్రంప్ ఇదే వాదన వినిపించినప్పుడు, భారత విదేశాంగ శాఖ దాన్ని ఖండించింది. అసలు ఆ రోజు ఇద్దరు నేతల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేసింది.