కొత్త అల్లుడికి 200 రకాల వంటలు
NEWS Oct 20,2025 11:49 am
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంకు చెందిన తులసీ రాంబాబు దంపతులు, దీపావళికి తొలిసారి అత్తింటికి వచ్చిన కొత్త అల్లుడు రాహుల్ (విశాఖపట్నం)కు 200 రకాల వంటకాలతో భారీ విందు ఇచ్చారు. ఇందులో ఏకంగా 100 రకాల నాన్-వెజ్ వంటకాలు, 100 రకాల వెజ్, స్వీట్లు, పిండివంటలు ఉన్నాయి. తమ గోదారోళ్ల ఆప్యాయతకు గుర్తుగా ఈ విందు ఏర్పాటు చేశామని మామగారు తులసీ రాంబాబు తెలిపారు. రకరకాల చేపలు, నాటు కోడి, పీతలు, రొయ్యలు, యాట మాంసంతో పాటు 20 రకాల బిర్యానీలు (మటన్, చికెన్, కీమా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.