సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కోసం వినతి
NEWS Oct 20,2025 11:53 am
బొర్రా పంచాయతీలోని నిన్నిమామిడి గ్రామానికి సిసి రోడ్డు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మట్టి రోడ్డు వర్షాలకు తట్టుకోలేకపోతుండటంతో రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలుగుతున్నాయని వారు వాపోతున్నారు. గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంతో వర్షపు నీరు నేరుగా ఇళ్లలోకి చేరుతుందని, ఇది స్థానికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవటంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.