ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
NEWS Oct 20,2025 12:17 am
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత జట్టు సెమీస్ రేసులో పోరాడి ఓడింది. ఉత్కంఠ పోరులో స్మృతి మంధాన(88), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70), దీప్తి శర్మ(50) అర్ధ శతకాలతో మెరిసినా జట్టును గట్టెక్కించలేక పోయారు. చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లండ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా 4 విజయాలతో నాట్ సీవర్ బ్రంట్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది.