ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలి: కలెక్టర్ సత్యప్రసాద్
NEWS Oct 19,2025 06:44 pm
జగిత్యాల: దీపావళి రోజున వెలిగించే ప్రతిదీపం ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకాంక్షించారు. వెలుగుల పండుగ దీపావళిని పునస్కరించుకొని ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ నాడు ప్రకాశించే దీపాల కాంతులు చీకట్లను తొలగించాలని.. మీ జీవితంలో కొత్త ఆశల్ని నింపాలని ఆశిస్తున్నా అని కలెక్టర్ అన్నారు.