అయోధ్య నగరం దీపకాంతులతో వెలిగిపోతోంది. 9వ దీపోత్సవంలో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి 26.17 లక్షల దీపాలు వెలిగించారు. ఏకకాలంలో 2,128 మందితో హారతి నిర్వహించారు. ఈ 2 గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కినట్లు UP ప్రభుత్వం ప్రకటించింది. రామ్‌లీలా వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో ఆకట్టుకున్నాయి. రామ్ కీ పైడీ ఘాట్‌లో CM యోగి హారతి నిర్వహించారు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలోని కళాకారులు ఆశీనులైన రథాన్ని లాగారు. అనంతరం దీపాన్ని వెలిగించి.. వేడుకలను ప్రారంభించారు.