ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు -కలెక్టర్
NEWS Oct 20,2025 12:11 am
ప్రజలందరూ ఆనందాల దీపావళి జరుపుకోవాలని కోరుతూ, జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. దీపావళి పండుగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని అన్నారు. ఈ శుభ సందర్భం జిల్లాలోని ప్రతి ఇంట్లో సంతోషాన్ని, సంపదను, సుఖశాంతులను నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని, శబ్ద, వాయు కాలుష్యం తక్కువగా ఉండే గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ పిలుపునిచ్చారు.