గుర్రాయి జలపాతాన్ని అభివృద్ధి చేయండి
NEWS Oct 20,2025 12:18 am
అల్లూరి జిల్లా,జీ.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయితీకి చెందిన గుర్రాయి గ్రామంలో టూరిజం డైరెక్టర్ రమేష్ నాయుడు పర్యటించారు. ప్రకృతి అందాలతో, కొండల నడుమ,పొడవైన చాపరాతి మీదుగా జలపాతం ప్రవహిస్తూ ఉంది. ఈ జలపాతం ఇరువైపులా పెద్ద కొండలు ఉండడంతో కిలోమీటర్లు పొడవునా చాపరాతి ఉండడంతో కొండల పైనుంచి వచ్చే నీరు చాపరాతి మీదుగా వెళ్లడం ప్రకృతి ప్రియులకు, సందర్శకులకు ఆకర్షిస్తుంది.జి మాడుగుల మండల కేంద్రం నుండి 3కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక గిరిజన ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని,జిల్లా కలెక్టర్,ఐటీడీఏ పీవో ఈ జలపాతాన్ని సందర్శించి టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలని కోరారు.