అందుకే బీఆర్ఎస్ ఓడింది: రేవంత్
NEWS Oct 19,2025 06:12 pm
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ధరణి చట్టమే ప్రధాన కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఒక్క చట్టం వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని, కొందరు దొరలు భూములపై పెత్తనం చెలాయించేందుకే గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని ఆరోపించారు. తమ పార్టీ గెలుపునకు చాలా కారణాలు ఉండవచ్చని, కానీ బీఆర్ఎస్ ఓటమికి మాత్రం ధరణి మాత్రమే కారణమని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణి నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని గుర్తుచేశారు. ఆ మాట ప్రకారమే, అధికారం చేపట్టిన వెంటనే ధరణిని రద్దు చేసి 'భూ భారతి' అనే కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చామని ఆయన వివరించారు.