ఏపీకి గూగుల్ రావడానికి కారణమెవ్వరంటే..
NEWS Oct 19,2025 06:09 pm
రాష్ట్రానికి ‘గూగుల్ ఏఐ డేటా సెంటర్’ రావడం వెనుక కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని, ప్రధాని మోదీ జోక్యంతోనే ఇది సాధ్యమైందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. తాను గూగుల్ సంస్థను ఏపీకి రావాలని కోరినప్పుడు, కేంద్ర చట్టాల్లో కొన్ని సవరణలు అవసరమని వారు చెప్పారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడి ఆ చట్టాలను సవరించేలా చేశారని లోకేశ్ వివరించారు. ఈ కేంద్ర ప్రభుత్వ చొరవతోనే గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏపీకి వచ్చిందని చెప్పారు.