వర్షాలకు కొట్టుకుపోయిన చెక్ డ్యామ్
NEWS Oct 19,2025 06:14 pm
అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో గల బల్లగరువు మల్లంపేట గ్రామాలలో రాత్రి కురిసిన వర్షాలకు కొండవాగు ఉదృతంగా ప్రవహించడంతో చెక్ డ్యాం శిథిలమైంది. శిధిలమైన చెక్ డ్యాం వద్దకు 2 గ్రామాల రైతులు వెళ్లి పరిశీలించారు, దీంతో చెక్ డ్యాం కిందన సాగు చేస్తున్న వరి పొలాలకు సాగునీరు అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధించిన అధికారులు స్పందించి చెక్ డ్యాంను మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లంపేట, బల్లగరువు గ్రామాల ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.