TG: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను BRS తొలి దెబ్బ జూబ్లీహిల్స్‌లో కొట్టబోతుందని స్పష్టం చేశారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామని తేల్చి చెప్పారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడని మండిపడ్డారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యమని స్పష్టం చేశారు.