BRS డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి
NEWS Oct 19,2025 01:43 pm
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముందు జాగ్రత్తలో భాగంగా పొరపాట్లు జరగకుండా BRS పార్టీ పి.జనార్ధన్ రెడ్డి (పీజేపీ) కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితోనూ నామినేషన్ వేయించింది. ఇప్పటికే ఆ పార్టీ తరపున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్ రెడ్డితోనూ BRS నేతలు నామినేషన్లు వేయించారు.