రామదాస పీఠ మూల నిధికి లక్ష రూపాయల విరాళం
NEWS Oct 19,2025 06:14 pm
భక్తి భావంతో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి విరాళాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం హనుమకొండకు చెందిన సముద్రాల రామనరసింహచార్యులు, సుజాత దేవి దంపతులు భక్తి పూర్వకంగా శ్రీ భద్రాచల రామదాస పీఠము మూలనిధికి రూ.1,00,101/- విరాళంగా అందించారు. దేవస్థానం అధికారులు దంపతులను అభినందించి, వారి సేవా భావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.