భద్రాచలం దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఆదివారం శ్రీ సీతా సమేత రామయ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. రామయ్య కళ్యాణానికి భక్తజనం ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో హాజరయ్యారు. రామయ్య కళ్యాణం అనంతరం రామయ్య అక్షంతలు భక్తుల స్వీకరించారు. అనంతరం రామయ్య మూలవిరాట్ ను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాణి తరలి వచ్చారని ఆలయ ఈవో దామోదర్ తెలిపారు.