నేడే హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు
NEWS Oct 19,2025 12:04 am
సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ సిద్ధమైంది. NTR స్టేడియంలో దున్నరాజుల ప్రదర్శన జరగనుంది. రేపు హైదరాబాద్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ సోదరులు సదర్ సమ్మేళనానికి తరలివస్తున్నారు. సదర్‌ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. భారీ ఆకారంలో ఉన్న దున్నపోతులు నేడు విన్యాసాలు చేయనున్నాయి. కాగా, ఈ నెల 22న నారాయణగూడలో పెద్ద సదర్ జరగనుంది.