స్మృతి మంధానా కాబోయే భర్త ఎవరు?
NEWS Oct 18,2025 11:49 pm
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు హాట్ టాపిక్. ఇటీవల స్మృతి గురించి అడిగిన ప్రశ్నకు పలాష్ ముచ్చల్ స్పందిస్తూ ‘స్మృతి మంధానా త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’ అని వెల్లడించారు. వీరిద్దరూ గత 6 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.