వరం, ప్రమాదం రెండూ మోసుకొస్తున్న AGI
NEWS Oct 18,2025 01:30 pm
HYD: “AI తర్వాత AGI మానవ జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, ఐతే దానితో పాటు మంచి-చెడు పరిణామాలు మరింత తీవ్రంగా కనిపించనున్నాయి” అని ప్రముఖ జర్నలిస్టు స్వామి ముద్దం హెచ్చరించారు. BRAOU జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వ ర్యంలో జరిగిన సెమినార్‌లో ‘AGI జర్నలిజం- అవకాశా లు, సవాళ్లు’ అనే అంశంపై స్వామి ముద్దం ప్రెజెంటేషన్ ఇచ్చారు. AGI రాకకు సమయం ఆసన్నమైందంటూ, ఇక పై మానవ జర్నలిస్టుల పాత్ర ఎలా ఉండాలో వివరించారు. సదస్సులో AI నిపుణులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.