హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ బీసీ బంద్‌లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెబుతున్నారు. నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుంచి తప్పుకొంటా. బీసీలం మేమెంతో మాకంత కావాలి. యాచించే స్థాయిలో కాదు.. శాసించే స్థాయిలో ఉన్నాం. బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురున్నారు. ఉన్న వారికి ఇచ్చిన శాఖలు చిన్నవి.