భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
NEWS Oct 18,2025 11:42 am
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై ₹ 1,90,000 వద్ద స్థిరపడింది. శుక్రవారం ఈ ధర ₹ 2,03,000గా ఉంది. ఇక, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై రూ. 1,910 తగ్గి రూ. 1,30,860కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం తులంపై రూ. 1,750 తగ్గి రూ. 1,19,950కి దిగొచ్చింది.