TG: కొనసాగుతోన్న బీసీ బంద్
NEWS Oct 18,2025 11:30 am
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఈ బంద్‌కు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతోపాటు ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.