బంగారం ధర ₹2లక్షలకు చేరనుందా?
NEWS Oct 17,2025 06:57 pm
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాగే పెరిగితే 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర ₹2 లక్షలకు చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹3,330 పెరిగి ₹1,32,770కు చేరిన విషయం తెలిసిందే. అమెరికా కరెన్సీ అప్పులు పెరగడం, గ్లోబల్ అస్థిరత కారణంగా ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 2027లోనే ఇది సాధ్యం కావొచ్చని మరికొందరంటున్నారు.