డీసీసీ పదవికి సత్యనారాయణ దరఖాస్తు
NEWS Oct 17,2025 06:59 pm
జగిత్యాల: డీసీసీ అధ్యక్ష పదవికి చెదల సత్యనారాయణ దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడిగా ఉన్న సత్యనారాయణ, ఎస్సీసీ సభ్యుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే జయరాజన్‌కు వినతిపత్రం అందజేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి ఏపీ కన్వెన్షన్ ఫంక్షన్‌లో నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేశాము. పార్టీ కోసం పనిచేసిన వారికి ఈసారి అవకాశం వస్తుందని ఆశిస్తున్నాము" అని సత్యనారాయణ పేర్కొన్నారు.