BSFI రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు
NEWS Oct 17,2025 07:01 pm
జగిత్యాల: రేపు రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు BSFI జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రోళ్ల వినీత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “బీసీలు చేస్తున్న 42% రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటం పూర్తిగా న్యాయబద్ధమైనది” అని పేర్కొన్నారు. “ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా ఇవ్వాలనే సాహెబ్ కాన్షీరాం గారి సిద్ధాంతాన్ని ప్రభుత్వం అమలు చేయాలి” అని వినీత్ డిమాండ్ చేశారు.