కాంగ్రెస్ అభ్యర్థికి AIMIM మద్దతు
NEWS Oct 17,2025 05:31 pm
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు AIMIM చీఫ్ అసదుద్దీన్ మద్దతు తెలిపారు. ఎన్నికల్లో నవీన్ గెలిచి జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయన్నారు. అంతకుముందు నవీన్ నామినేషన్ దాఖలు చేశారు.