పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
NEWS Oct 17,2025 07:05 pm
అనంతగిరి (మం) జీనబాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని పంచాయతీ టిడిపి అధ్యక్షుడు గండి సురేష్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు, ఎస్ఎంసి సభ్యులు కలిసి ఐటీడీఏ పీఓ కు వినతిపత్రం అందజేశారు. “మండలంలోని మారుమూల గ్రామాలైన పినకోట, జీనబాడు ప్రాంతాల్లో సుమారు 150 పైబడి 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. అయితే, వీరికి 100 కి.మీ దూరంలో ఉన్న శివలింగపురంలో పరీక్ష కేంద్రం కేటాయించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు” అని తెలిపారు. అక్కడ వసతి సౌకర్యాలు తగిన విధంగా లేవని, విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా జీనబాడు పాఠశాలలోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి సీనియర్ నాయకులు పాగి దేముడు తదితరులు పాల్గొన్నారు.