మక్క కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Oct 17,2025 05:33 pm
ఇబ్రహీంపట్నంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తహశీల్దార్ వరప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు బోరిగం రాజు, వెంకట్ రెడ్డి,ప్యాక్స్ ఛైర్మన్లు బద్దం గోపీ, పాక్స్ సీఈఓ సతీష్, అగ్రికల్చర్ ఏవో రాజకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం అందించే మద్దతు ధర ₹2400 పొందాలని కోరారు. నష్టపోవద్దని సూచించారు. అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.