స్థానిక ఎన్నికలు ఎప్పుడు?: హైకోర్టు
NEWS Oct 17,2025 01:43 pm
ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో 2 వారాల్లోగా స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని, ఈసీని ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని కోర్టు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ల సమస్య వల్లే నోటిఫికేషన్ నిలిపివేశామని కోర్టుకు ఈసీ తెలిపింది. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేయడంతో, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం ఇటీవల నిలిపివేసిన సంగతి తెలిసిందే.