పార్టీ నన్ను మోసం చేసింది: కోమటిరెడ్డి
NEWS Oct 17,2025 01:35 pm
తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీయే తనను దారుణంగా మోసం చేసిందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. "కాంగ్రెస్ పార్టీని కాపాడటం కోసం నేను నా సొంత ఆస్తులు అమ్ముకున్నాను. అయినా పార్టీ నన్ను మోసం చేసింది" అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు.