ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి
NEWS Oct 17,2025 07:15 pm
రాజమండ్రి నగరంలో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను వెంటనే టీడీపీ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్యం సిండికేట్‌లకు ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉన్నందువల్లే అవి బలంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.