'ఆడియో లీక్ పై దర్యాప్తుకు ఆదేశించాం'
NEWS Oct 17,2025 07:07 pm
రాజమండ్రికి చెందిన టిడిపి నాయకులు మద్యం సిండికేట్‌పై చర్చించినట్లు విడుదలైన ఆడియో లీక్ అంశంపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు దర్యాప్తు ఆదేశాలు జారీచేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, “రాజమండ్రిలో మద్యం సిండికేట్ కొనసాగుతోందని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటు” అన్నారు. ఈ అంశంపై పూర్తి నిజాలు త్వరలో వెలుగులోకి వస్తాయని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు.