డ్రైనేజీ నిర్మాణం కోరుతున్న గిరిజనులు
NEWS Oct 17,2025 07:10 pm
అరకులోయ (మం) చొంపి గ్రామ గిరిజనులు తమ గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, వర్షాలు పడినప్పుడు వరదనీరు, గృహ వ్యర్థ నీరు సీసీ రోడ్లపై నిలిచిపోతూ దుర్వాసనతోపాటు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గ్రామంలో దోమలు, ఈగలు పెరిగి మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయని గిరిజనులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ నిర్మాణంపై ఎన్నోసార్లు అధికారులను కోరినప్పటికీ స్పందన లభించలేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి డ్రైనేజీ నిర్మాణం చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.