బీసీ రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వండి
అధికారులను ఆదేశించిన మంత్రివర్గం
NEWS Oct 16,2025 09:42 pm
TG: బీసీలకు 42 % రిజర్వేషన్లపై 2 రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని మంత్రివర్గం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై క్యాబినెట్‌లో చర్చించారు. ఈ కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించింది.