మైసమ్మగూడలోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ భాగస్వామ్యంతో డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఉత్సాహాన్ని అందిస్తూ వారితో కలిసి మల్లారెడ్డి డీజే టిల్లు పాటకు డాన్స్ వేశారు. అచ్చంగా డీజే టిల్లు సాంగ్ స్టెప్పులతో హుషారుగా డాన్స్ వేసి యువతలో జోష్ నింపారు.