కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన గిరెడ్డి మహేందర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉందని, పార్టీకి చేసిన సేవలను వివరిస్తూ ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ రాజు పాల్ కి దరఖాస్తు ఫారం అందజేశారు. తనకు జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని, పార్టీకి మరింత సేవ చేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.